ఆర్ఎంపి, పిఎంపి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు
ఆర్ఎంపి, పిఎంపి సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు
-హుజూరాబాద్:
శ్రీ విఘ్నేశ్వర ఆర్ఎంపి, పిఎంపి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ జెండా ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని, వారి త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ఆ త్యాగధనుల స్పూర్తితో వారు చూపిన మార్గంలో నడవాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. సుసంపన్నమైన భారతదేశం కోసం కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కన్నెబోయిన తిరుపతి, రామరాజు, గౌరవ అధ్యక్షులు కృష్ణమూర్తి, సంగెం ఐలయ్య, వెంకట్, మండల్ రమణ చారి, ధనుంజయ, పరమేశ్వర్, వెంకటేశ్వర్లు, సదానందం తదితరులు పాల్గొన్నారు.
