యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స

0

యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స
– నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్
– కిడ్నీ బయాప్సి పరీక్ష విజయవంతం
– పెయిన్ కిల్లర్స్, కిడ్నీ గాయం, మాజికల్ రికవరీ
కరీంనగర్:
పెయిన్ కిల్లర్ మందులు వాడి డయాలసిస్ దాకా వెళ్ళిన మహిళకు సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు కిడ్నీ బయాప్సీ పరీక్ష ద్వారా సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన రాధా అనే మహిళ కు కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, నడుము నొప్పి రావడం వలన దగ్గర్లోని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గర పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకుంది. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత మహిళకు జ్వరం, వాంతులు, ఒళ్ళు నొప్పులు ఉండడం వలన దగ్గర్లోని హాస్పిటల్ కి వెళ్ళింది. అక్కడ మహిళకు రక్త, మూత్ర పరీక్షలు చేయగా సీరం క్రియాటిన్ 6 గా ఉందని, కిడ్నీ డయాలసిస్ చేసుకోవాలని సూచించారు. ఆమె బంధువుల ద్వారా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని సంప్రదించింది. యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత అన్ని రకాల పరీక్షలు చేశామన్నారు. అప్పటికే సిరం క్రియాటిన్ 10 వరకు వెళ్లింది. అయినా కూడా డయాలసిస్ చేయకుండా పేషెంట్ బంధువులతో మాట్లాడి కిడ్నీ బయాప్సి పరీక్ష చేశాం. కిడ్నీ బయాప్సి పరీక్ష తర్వాత పేషెంట్ కు డయాలసిస్ అవసరం లేకుండా వారం రోజులలోగా సీరం క్రియాటిన్ యొక్క లెవెల్స్ ని సాధారణ స్థితికి మందుల ద్వారా తగ్గించాం. ప్రస్తుతం పేషెంట్ సాధారణ జీవితం గడుపుతూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ సంతోషంగా ఉంది. తొందరగా లక్షణాలను గుర్తించడం, సరైన సమయానికి ఆస్పత్రికి రావడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుండి, డయాలసిస్ నుండి బయటపడగలిగారు. ప్రతి ఒక్కరు శుభ్రమైన నాణ్యమైన ఆహారం తీసుకుంటూ ప్రతి సంవత్సరానికి ఒకసారి వైద్య పరీక్షలను చేసుకోవాలన్నారు. బయట ఆహార పదార్థాలను తక్కువగా తీసుకుంటూ ఇంటిలో వండిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *