మనుషులు మారాలి – లేదంటే ప్రకృతే మనుషులను మార్చేస్తుంది

0

మనుషులు మారాలి – లేదంటే ప్రకృతే మనుషులను మార్చేస్తుంది
. మనుషుల ఆలోచనలో మార్పు ప్రకృతిని రక్షించేలా ఉండాలి
. నిరంతర ప్రకృతి రక్షణ – జీవకోటికి మనుగడ.
. పర్యావరణవేత్త రవిబాబు పిట్టల

ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. మనకూ, మనచుట్టూ (గాలిలో, నీటిలో మరియు భూమి పైన) ఉన్న ఇతర జీవరాసులు ప్రకృతిలోనుండి వచ్చిన వాళ్ళమే. కొందరైతే ప్రకృతిని దైవంగా భావిస్తారు. ఇంకొందరు ప్రకృతి పంచాభూతలను అర్ధంచేసుకొని, రక్షణ పొందుతూ, రక్షిస్తూ వాటితో మమేకమై అవసరమైన జీవనాన్ని జీవిస్తున్నారు. ఇంకొందరు ఇదే దోరణితో పాటు “ప్రకృతిని రక్షించుకొంటేనే జీవించగలం” అని ప్రకృతిని అర్ధంచేసుకొని లీనమై జీవిస్తున్నారు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ఈ సత్యం తెలువక కొందరు తెలుసుకునే ఆసక్తి, సమయం లేక మరి కొందరు, ప్రకృతి సూత్రము, ప్రకతి సిద్ధాంతము తెలియక ఇంకొందరు, ఆధునికత, అభివృద్ధి ముసుగులో కొందరు స్వార్ధపూరితమైన ఆలోచనతో తమ యొక్క విలాస జీవనం కొరకు లేదా తమవారి కొరకు అవసరాలకు మించి సహజ వనరుల సంపదను ఒకేసారి డబ్బు రూపంలోకి మార్చాలని మట్టిని, ఇసుకను, నీటిని, మొరాన్ని, కొండలను, గాలిని, సముద్ర సంపదనను, లోహాలు మరియు ఖనిజ సంపదను కొల్లగొడుతూ కుప్పలు చేసుకుని ధనవంతులమని విర్రవీగుతున్నరు.
మనకు హాయిగా జీవించమని మన పూర్వికులిచ్చినటువంటి ప్రకృతి సంపదలను భవిష్యత్ తరాలకు మిగులకుండా దోపిడి చేసి, తమ వారసులకు దోచిన ఈ సహజ వనరులను మార్చి డబ్బును, ఇల్లు, బంగారం, ఆస్తిపాస్తులను, కంపెనీలను ఇంకా అనేక రూపాలలో వారసత్వ ఆస్తిగా ఇస్తూ, తమ వారసులు సుఖంగా జీవిస్తరనే భ్రమలో జీవిస్తూ ప్రకృతి, పర్యావరణం, సహజవనరుల సంపాదలకు మరియు పంచాభూతల మనుగడకు అడ్డుగా నిలిచి అనేక రూపాలలో సహజ జీవ జీవనానికి సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారని, పర్యావరణ పరిస్థితులను అసమతుల్యం చేస్తున్నామని మరచిపోతున్నరు. ఈ అఘాయిత్యాలను ఉపేక్షించలేక తమదైన శైలిలో ప్రకృతి అనేక విపత్తు (ప్రకృతి వైపరిత్యాలు) రూపాలలో, తాత్కాలిక మరియు దీర్ఘ కాలిక విఘాతాల రూపాలలో తమ అసహనాన్ని అప్పుడప్పుడు, అక్కడక్కడా (ప్రపంచవ్యాప్తంగా) మానవునికి చూపిస్తూనే ఉన్నది.
ఈ తరుణంలో మనిషి తామే తెలివైనవాడినని, ఈ సమస్త సృష్టి, శతకోటి జీవరాసులకంటే తమకే తెలివి ఉందని తమపై అధికారాన్ని ప్రదర్శిస్తూ, అక్రమ వాడుకను ఉపయోగిస్తూ ప్రకతి ధర్మానికి ఎదురెలుతు రోజు రోజుకు ఉపేక్షించలేని స్థాయిలో ప్రకృతిపై తమ అధికారాన్ని, అధిపత్యాన్ని, డౌర్జన్యాన్ని, దాస్టికతను ఇంకా అనేక వ్యతిరేక కృత్యాలతో చెలాయిస్తున్నాడు. ఈ క్రమం తప్పిన, అహంకారపూరితమైన, స్వార్ధపు ఎత్తుగడలను ప్రదర్శిస్తూ, పర్యావరణ సమతూల్యతను చిన్నాభిన్నాం చేస్తూ ఒక మానసిక రుగ్మతలో పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ప్రకృతి ధర్మానికి శాస్త్ర, సాంకేతికతను అక్రమ మార్గంలోనికి తీసుకొని ఉపయోగిస్తూ, ఎదురెల్లి ఆవాసాలల మనుగడకు ముప్పువాటిల్లేలా తమ తప్పుడు ఆచరణాలను ప్రోత్సహిస్తూ ఆచరిస్తున్నడు, ఏదో సాధించానని విర్రవీగుతూ తమ అకృత్యాలతో ఆపదలను విపత్తుల రూపంలో వెంటతెచుకుఅంటున్నానని గమనించలేకపోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రకృతిలో నడుస్తున్న మనిషికి ప్రకృతి తమ హెచ్చరికలతో అప్పుడప్పుడు “నీమార్గాన్ని మార్చుకో – లేదంటే నీకు మనుగడలేదు. నీతోపాటు సమస్థజీవకోటి నాశనమైతుంది” అని తమదైనశైలిలో తెలియచేస్తూనే ఉన్నది. ఐనా మనిషి మారడంలేదు, అతనికి స్వార్ధపు దాహం తీరడంలేదు. తమేకాక తమచుట్టూ ఉన్న (తమతోపాటుగా) మిగిలిన జీవరాసి జీవనాన్ని, జీవ మనుగడను కూడా నాశనం చేస్తూ, తన పెత్తనంతో హరించి వేస్తూ వాటి విలుప్తానికి కారకుడౌతున్నానని మర్చిపోతున్నడు.
ఈ తరుణంలోనే అనేక జీవుల మనుగడ కష్టాల్లోకి వెళ్ళిపోయి, వాటి జీవన శైలి మార్చుకున్నా… మార్పులు సరిపోక జీవులు వాటి జీవనం కనుమరుగతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఈ భూమండలం పైన ఏ జీవి జీవించలేదు, తమ అస్తిత్వాన్ని, జీవపరిణామ సిద్ధాంతాపరంగా ముందుకెళ్ళలేదు. ఇది తమ మనుగడ కోల్పోతున్న జీవుల జీవన విధానపు వాస్తవం.
ఇట్టి విషయాన్నీ మనలో కొందరైనా అర్ధంచేసుకొని ముందుకొచ్చి, ప్రకృతిని, పర్యావరణాన్ని, సహజవనరులను, పంచభూతాలను, సకల చరాచర జీవారసుల మనుగడను, వాటియొక్క ప్రాముఖ్యతను వివరించే ఆలోచన మార్పు దిశగా మనం ఇకనైనా మేల్కొని ముందుకెలుతేనే ప్రకృతిలో జీవ మనుగడకు సాధ్యం. లేదంటే ప్రకృతి తమను తాను సమతూల్యతను పాటించే దిశలో సమం చేసుకుంటుంది. ఈ తరుణంలోనే మనమనుగడకు ముగింపు పలికి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకొని మళ్ళీ తిరిగి తమ ధర్మాన్ని పాటిస్తూ ప్రకృతి ముందుకెలుతుంది. ఈ ప్రక్షాళనకు ఎన్నేళ్ళైనా పట్టొచ్చు కానీ, మార్పులో మాత్రమే మార్పుండదు. అందులో మనముండము. అందుకే మనము మారాలి. మనచుట్టూ ఉన్న మనుషులను ప్రకృతి ధర్మానికి, రక్షణకు అనుకూలంగా మారమని అవగాహన చెయ్యాలి. అందుకు తోడుగా మన వలన ప్రకృతి, పర్యావరణ, సహజ వనరులను ఎలా కాపాడగలమో మనకర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దీనిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ /జి. ప్రతీ భారతదేశ పౌరుని ప్రాధమిక విధిగా తెలుపుతూ బోదిస్తుంది.
ప్రకృతిని రక్షించుకోలేకపోతే మానవ మనుగడలేదని తెలుసుకున్న ప్రపంచంలోని అనేక దేశాలు తమాదైన కోణంలో, ప్రకృతి, పరిసరాల రక్షణ దిశలో ఆలోచిస్తూ ముందు చూపుతో ముందుకెలుతున్నాయి. కాబట్టి ప్రకృతి ధర్మాన్ని అర్ధంచేసుకుని, దాన్ని రక్షించే దిశగా ప్రతీ జీవి జీవన మనుగడను, దాని ఆవాసాన్ని కాపాడుతూ, ఆరోగ్యాకరమైన జీవనాన్ని జీవిస్తూ, ఇదే జీవనాన్ని ఒక వారసత్వ ఆస్తిగా రాబోవు తరాలకందివ్వడమే మన నిజమైన వారసత్వపు ప్రధాన కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలి. లేదంటే ప్రకృతి ఉపేక్షించే స్థాయిని దాటాక తామంతటా తామే ప్రక్షాళన సమాతుల్యత సూత్రంతో సమం చేసుకుంటుంది.
రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, జాయింట్ సెక్రటరీ, ఓర్గల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఎన్జీవో (OWLS NGO) వరంగల్, వైస్ ప్రెసిడెంట్, UFEP NGO, వరంగల్, మరియు ఫాకల్టీ CWR, JNTUH, హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *