ఈనెల 19న వరంగల్ కు సీఎం రాక…

2

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్లు..
హనుమకొండ:
ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకరా టి.ఎస్., రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ ఈఈ సురేష్ బాబు, కుడా, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *