అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలి
జర్నలిస్ట్ యూసూఫ్ పై పెట్టిన అక్రమ కేసు వెంటనే ఎత్తివేయాలి
. టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్, సిపికి వినతి
కరీంనగర్:
జర్నలిస్టు ఎండి యూసుఫ్ పై చందుర్తి పోలీస్ స్టేషన్లో పెట్టిన అక్రమ కేసును తొలగించి, అతనిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే తిరుపతి, కే బాపూరావు లు డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మరియు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతిలను కలిసి వినతి పత్రాలు అందజేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కలెక్టర్, సిపి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల పోలీసులు ఇటీవల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ మెంబర్, సిరిసిల్ల జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడైన జర్నలిస్టు ఎండి యూసుఫ్ కు సంబంధంలేని ఒక కేసును అంటగట్టి అతనిపై అక్రమంగా కేసు నమోదు చేశారని తెలిపారు. యూసుఫ్ పై పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరింపజేసి, అతనిని వెంటనే విడుదల చేయాలని కోరారు. తప్పు చేయని జర్నలిస్టులపై ఇలా తప్పుడు కేసులు పెట్టడం తగదు. ఈ సంఘటనపై ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చట్ల శంకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్, నరేష్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి జర్నలిస్టులు, ప్రసాద్, అంజయ్య, శంకర్ రెడ్డి, రవీందర్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
