ఆసుపత్రి సూపరింటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి

5

ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి
జమ్మికుంట:
జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ గా డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంచార్జి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వనరులతో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించి మరింత మెరుగైన వైద్యం అందేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేము, మా సిబ్బంది పని చేస్తామని, దానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రస్తుతం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జన్ గా విధులు నిర్వహిస్తున్నానని కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సూపరింటెండెంట్ బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి కి పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *