బీసీ రిజర్వేషన్ల బిక్ష బీపీ.మండల్ చలువే…

5

బీసీ రిజర్వేషన్ల బిక్ష బీపీ.మండల్ చలువే..
. పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్
. ఘనంగా బీపీ మండల్ 106వ జయంతి
కాకతీయ యూనివర్సిటీ:
బీసీ రిజర్వేషన్ల బిక్ష బీపీ.మండల్ చలువే అని పాస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ, మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రాంగణములో పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో బీపీ మండల్ 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..భారతదేశంలో ఓబీసీలకు రిజర్వేషన్లలో జరుగుతున్న అన్యాయం కేవలం జనగణన చేయక పోవడమే ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓబీసీలు విద్యా, ఉద్యోగ రంగాల్లో అనుభవిస్తున్న రిజర్వేషన్లు నాడు బీపీ మండల్ చైర్మన్ గా ఉన్నప్పటివేనన్నారు. వెనుకబడిన తరగతులకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక రకాల అధ్యయనాల ద్వారా 1980లో 40 అంశాలతో కూడిన నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, బిజేపి ప్రభుత్వాలు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా సంవత్సరాల పాటు కాలాయపన చేయడం వల్ల అమలుకు నోచుకోలేదన్నారు. తదుపరి వచ్చిన విపి.సింగ్ ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాల్లో 27శాతం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. ఓబీసీల జనగణన చేయకుండా జాప్యం చేస్తున్న బిజేపి ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో పాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడురి శాస్త్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్, జిల్లా నాయకులు డాక్టర్ పెద్ద బోయిన వెంకటయ్య, డాక్టర్ వంగాల సుధాకర్, కంజర్ల నర్సింహరాములు, మోటే చిరంజీవి, డాక్టర్ శంకర్, సురేందర్, నీలం ప్రనూప్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *