యశోద ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
యశోద ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
. మొట్టమొదటిసారి మెదడు రక్తనాళాల్లో స్టంట్ వేసిన వైద్యులు
కరీంనగర్:
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రణిత 33 సంవత్సరాలు అనే మహిళకు కోత లేకుండా మెదడులోని రక్తనాళానికి అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు యశోద ఆసుపత్రి హైదరాబాద్ వైద్యులు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ కృష్ణ , ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రీహరిష్ తెలిపారు. కరీంనగర్ లోని యశోద కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి తల నొప్పి, తల తిప్పడం, వాంతుల సమస్యలతో బాదపడుతున్న మహిళ కరీంనగర్ లోని అనేక ఆసుపత్రులను సంప్రదించిన తర్వాత మందులతో తగ్గదని, మెదడులో నీరు చేరిందని దాన్ని ఆపరేషన్ ద్వారా తీసివేసి జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుందని ఇక్కడి వైద్యులు తెలిపారని, దానికి భయపడి హైదరాబాద్ యశోదకు వస్తే పూర్తి నిర్ధారణ చేసి, ఇది ఇంటియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్టైన్షన్ అని గుర్తించామని తెలిపారు.దీని వల్ల మెదడులో ఒత్తిడి పెరుగుతుందని కొద్దిరోజులుగా కళ్ళు మసకబారుతున్నాయని పిర్యాదు చేసిందని తెలిపారు. దీనితో దృష్టికి కారణమయ్యే నరాల వాపుకు దారితీసి దృష్టి తగ్గుతుందని తెలిపారు. ఇది మందులతో తగ్గకపోగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆపరేషన్ చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న పరికరం ద్వారా స్టంట్ ను తొడలోని రక్తనాళం ద్వారా దేహంలోకి పంపి, ప్రభావితమైన సైనస్ అమర్చడం జరుగుతుంది. దీని వల్ల రక్తప్రవాహాం మెరుగుపడి పుర్రెలో ఒత్తిడి తగ్గడం జరుగుతుందని వివరించారు. రోగికి ఎటువంటి కోత, నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా మొట్టమొదటిసారిగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించామని, స్టంట్ వేసిన తర్వాత అప్పటికప్పుడు నొప్పి నుంచి ఉపశమనం పొందిందని తెలిపారు.
