కాంగ్రెస్ లో చేరిన వైయస్ షర్మిల..

0

ఏ బాధ్యత ఇచ్చిన శక్తి వంచన లేకుండా పనిచేస్తా..
. వైయస్ షర్మిల
. కర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
ఢిల్లీ:
వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. గురువారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందని షర్మిల తెలిపారు. ‘‘వైఎస్సార్‌ జీవితామంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారన్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడటం మా నాన్న కల అన్నారు. నేను మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నా. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే లౌకిక పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. ఇవాళ్టి నుంచి కాంగ్రెస్‌లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఒక భాగమన్నారు. కేసీఆర్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణలో పోటీ చేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా పనిచేస్తా’’ అని షర్మిల వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *