నిధులను మళ్లించిందెవరు?

0

కేంద్రం ఇచ్చిన నిధులను డైవర్ట్ చేసిందెవరు?
. తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి
. ఎంపీ బండి సంజయ్ కుమార్

కరీంనగర్:
వైకుంఠధామాలు సహా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని బిజెపి జాతీయ కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. జాతీయ రహదారుల నిధులన్నీ కేంద్రానివేనని, చివరకు పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించి సర్పంచులకు బిల్లులివ్వకుండా దివాళా తీయించింది మీరు కాదా? అని బిఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలకు కేంద్రం నిధులిస్తే… బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా గొప్పలు చేసుకుంటూ ప్రజలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే అన్నారు. కోవిడ్ టైంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు భరోసా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు 80 దేశాలకు పైగా ఉచితంగా వాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే అన్నారు. బీఆర్ఎస్ అన్నీ తామే చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వం 6 లక్షల 75 కోట్ల రూపాయల అప్పుల్లో మునిగి ఉందని, జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఉందన్నారు. అయినా 6 గ్యారంటీలంటూ కాంగ్రెస్ హామీలిచ్చిందని, అసలు అప్పులను ఎట్లా తీరుస్తారు? 6 గ్యారంటీల అమలుకు నిధులెక్కడి నుండి తీసుకొస్తారు? మీ ప్రణాళిక ఏమిటి? సంపదను ఏ విధంగా సృష్టిస్తారు? అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో ప్రజలకు వివరించాలి? ఈ విషయంలో ప్రజల్లో అనేక సందేహాలున్నాయి? వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీలో 130 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ పై స్పందిస్తూ…. మేం ఎప్పటి నుండో ఆరోపిస్తున్నాం. నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపలేదు. ఇప్పటికైనా స్పందించింనందుకు సంతోషం. దీనిపై బీజేపీ పక్షాన పోరాడుతాం… అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేదాకా ఉద్యమిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *