ఆసుపత్రికి కావలసిన సహకారాన్ని అందిస్తాం..

0

వైద్య కళాశాల, ఆసుపత్రికి కావలసిన సహకారాన్ని అందిస్తాం..
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
కరీంనగర్ మెడికల్ కళాశాల, ఆసుపత్రికి అవసరమైన సహకారాన్ని ప్రాధాన్యత ప్రాతిపాదికన అందజేస్తానని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మెడికల్ కాలేజీని జిల్లా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వైద్య కళాశాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ లక్ష్మీ నారాయణ మెడికల్ కళాశాల భవనం, పరికరాలు, మౌలిక సదుపాయాలు మరియు అధ్యాపకుల స్థితిని వివరించారు. ఎంబీబీఎస్ 1వ సంవత్సరం విద్యార్థులతో కలెక్టర్ సంభాషించారు. కలెక్టర్ కు కళాశాల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థులు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్య కళాశాల మరియు ఆసుపత్రికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ప్రాధాన్యత ప్రాతిపదికన అందజేయుటకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శంతన్, డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ లలితా దేవి, ఆర్ఎంఓ డాక్టర్ నవీన, మరియు సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్ ఆదిత్య, అధ్యాపకులు మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *