పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం కావాలి

0

పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం కావాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అధికారులు ఎన్నికల ఏర్పాట్లకు సన్నద్దం కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్ పార్లమెంటరీ నియోజక వర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో పార్లమెంటరి ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…కరీంనగర్ పార్లమెంటరి పరిధిలో 7 నియోజక వర్గాలైన కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్లా, పిఓ ఎపిఓ, ఒపిఓ ల ట్రాన్స్ పోర్టేషన్, ఎన్నికలకు సంబందించిన నోడల్ అధికారుల నియామకం అందుకు కావాల్సిన మౌళిక వసతులను సమీక్షించారు. జిల్లా ఎలక్షన్ మెనేజ్ మెంట్ ప్లాన్ నిర్వహించి ఎన్నికల సంసిద్దతపై సమీక్షించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు మ్యాన్ పవర్ మెనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలో చూసుకోవాలన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు లేదా ప్రతినిధులతో సమీక్షించి 2 కి.మి. కన్న ఎక్కువ దూరంలో పొలింగ్ కేంద్రాలు ఉన్నా, లేదా 13వందల కన్న ఎక్కువ మంది ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నవాటిని గుర్తించి కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్దం చేయాలని తెలిపారు. అన్ని నియోజక వర్గాలలోని పోలింగ్ కేంద్రాల పరిధిలో మరణించిన, బదిలి అయిన, డూప్లికేట్ మొదలైనవి లేకుండా పకడ్బంది ఓటరు జాబితాను సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డీవో కె. మహేశ్వర్, హుస్నాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్, సిరిసిల్లా ఆర్డీవో ఆనంద్ కుమార్, వేములవాడ ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *