రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన టీడబ్ల్యూజేఎఫ్

రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన..
. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ 

హైదరాబాద్:
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది.ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గానికి కూడా ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లోనైనా జర్నలిస్టులకు రక్షణ కల్పించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదిన్నరేళ్ళుగా తెలంగాణ మీడియా, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు అనేక అవమానాలు, ఛీత్కారాలు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పని చేస్తారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇండ్ల స్తలాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.