తెలంగాణలో మంత్రులు వీరే…

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు డిసెంబర్ 7న గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయగా శనివారం మంత్రులకు శాఖలను కేటాయించారు. మంత్రుల జాబితాను సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళ సై కి అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం శాఖలు కేటాయింపు..

1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ & ఇంధన శాఖ
2. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు – ఐటీ శాఖ & అసెంబ్లీ వ్యవహారాలు
3. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి – పౌరసరఫరాల శాఖ & నీటిపారుదల
4. దామోదర రాజనర్సింహ – వైద్య ఆరోగ్యశాఖ
5. తుమ్మల నాగేశ్వర్ రావు – వ్యవసాయశాఖ & చేనేత
6. జూపల్లి కృష్ణారావు – ఎక్సైజ్‌ శాఖ & పర్యాటకం
7. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి – రోడ్లు భవనాలు & సినిమాటోగ్రఫీ
8. పొన్నం ప్రభాకర్‌- రవాణా శాఖ & బీసీ సంక్షేమం
9. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి – రెవెన్యూ, గృహానిర్మాణం & సమాచార శాఖ
10. కొండా సురేఖ- అటవీశాఖ, పర్యావరణ & దేవాదాయ శాఖ
11. సీతక్క- పంచాయతీరాజ్‌ శాఖ & మహిళా శిశు సంక్షేమం…

అనుముల రేవంత్ రెడ్డి సీఎం

పురపాలక-పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు
కొడంగల్ నియోజకవర్గం.. వయస్సు 54 సంవత్సరాలు.
ఓసి (రెడ్డి) సామాజిక వర్గం.
విద్యారత బిఎ.
2006 లో మిడ్జిల్ మండలం జడ్పిటిసిగా విజయం సాధించారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుసగా విజయం సాధించారు. 2014, 2017 వరకు టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా 2017లో కాంగ్రెస్ లో చేరారు. 2019లో మల్కాజగిరి ఎంపీగా విజయం సాధించారు. 2021 జూన్ 26 నుంచి పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం
. ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్తు శాఖలు
. నియోజకవర్గం: మధిర
. వయస్సు: 62 సంవత్సరాలు
సామాజిక వర్గం : ఎస్సీ (మాల)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గా, డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరించారు. 2023 వరకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా పనిచేశారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దుద్దిల్ల శ్రీధర్ బాబు
. ఐటి పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ.
. మంథని నియోజక వర్గం. 54 సంవత్సరాలు.
. ఓసి (బ్రాహ్మణ) సామాజిక వర్గం
. విద్యార్హత ఎల్.ఎల్.బి
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా, మంత్రిగా పనిచేశారు. మంథని నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి..
. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ
. హుజూర్ నగర్ నియోజకవర్గం
. వయస్సు 61 సంవత్సరాలు
. ఓసి (రెడ్డి) సామాజిక వర్గం
. విద్యార్హత బిఎస్సి
కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు పిసిసి అధ్యక్షుని గా విధులు నిర్వర్తించారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దామోదర రాజనర్సింహ
. వైద్య-ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సాంకేతిక శాఖలు
. ఆందోల్ నియోజకవర్గం
. వయస్సు 63 సంవత్సరాలు
. ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గం
. విద్యారత బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్
వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. కొనేజేటి రోశయ్య మంత్రివర్గంలోను పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తుమ్మల నాగేశ్వరరావు
. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ
. ఖమ్మం నియోజకవర్గం
. వయస్సు 70 సంవత్సరాలు
. కమ్మ సామాజిక వర్గం
. విద్యారత బీకాం
ఎన్టీఆర్ ప్రభుత్వంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా, చంద్రబాబు మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల, ఎక్సైజ్ శాఖ మంత్రిగా భారీ నీటిపారుదల, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జూపల్లి కృష్ణారావు
. ఎక్సైజ్, పర్యటక శాఖ
. కొల్లాపూర్ నియోజక వర్గం
. వయస్సు 68 సంవత్సరాలు
. ఓసి (వెలమ) సామాజిక వర్గం
. విద్యారత బిఏ డాక్టర్
వైయస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పౌరసరఫరాల, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
. రోడ్ల భవనముల, సినిమాటోగ్రఫీ శాఖ
. నల్లగొండ నియోజక వర్గం
. వయస్సు 60 సంవత్సరాలు ఓసి (రెడ్డి) సామాజిక వర్గం విద్యారత బీటెక్
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్ యూత్ కమ్యూనికేషన్ మంత్రిగా పనిచేశారు. భువనగిరి ఎంపీగా 17వ లోకసభకు ఎన్నికయ్యారు. నల్గొండ ఎమ్మెల్యేగా ఐదోసారి గెలుపొందారు.

పొన్నం ప్రభాకర్
. రవాణా, బీసీ సంక్షేమ శాఖ
. హుస్నాబాద్ నియోజకవర్గం
. వయస్సు 56 సంవత్సరాలు
. బిసి (గౌడ) సామాజిక వర్గం
. విద్యారత బిఏ ఎల్.ఎల్.బి
ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ చైర్మన్ గా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు కరీంనగర్ ఎంపీగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్ లో కొట్లాడారు. మొదటిసారిగా హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ
. పాలేరు నియోజకవర్గం
. వయస్సు 58 సంవత్సరాలు
. ఓసి (రెడ్డి) సామాజిక వర్గం
. విద్యార్హత బిఏ ఎల్.ఎల్.బి
2013లో వైఎస్ఆర్ సీపీలో చేరారు. 2014లో ఆ పార్టీ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా విజయం సాధించారు. పాలేరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కొండా సురేఖ
. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ
. వరంగల్ తూర్పు నియోజకవర్గం
. వయస్సు 57 సంవత్సరాలు
. బిసి (మున్నూరు కాపు) సామాజిక వర్గం
. విద్యార్హత బిఎ
డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ, వికలాంగులు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

దానసరి అనసూయ (సీతక్క)
. పంచాయతీరాజ్ మహిళ శిశు సంక్షేమ శాఖ
. ములుగు నియోజకవర్గం
. వయస్సు 52 సంవత్సరాలు
. ఎస్టి (కోయ) సామాజిక వర్గం
. విద్యార్హత ఎల్.ఎల్.బి
మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.