ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే…

0

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ఇవే…
. 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు

హైదరాబాద్:
2024 సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. వచ్చే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌ట్రుమెంటల్ చట్టం కింద 23 సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి 2024లో నూతన సంవత్సరం జనవరి 1, భోగి 14, సంక్రాంతి 15, గణతంత్ర దినోత్సవం 26.
మార్చి 8న మహాశివరాతి, 25న హోలీ మరియు 29న గుడ్ ఫ్రైడే.
ఏప్రిల్‌లో 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 9న ఉగాది, 11న ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్), 12న రంజాన్, 14న డాక్టర్ అంబేద్కర్ జయంతి 14, 17న శ్రీరామ నవమి.
జూన్‌లో..6న బక్రీద్‌,
జూలైలో..17న మొహర్రం, 29న బోనాలు.
ఆగస్టులో..15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 26న శ్రీకృష్ణాష్టమి.
సెప్టెంబర్‌ లో 7న వినాయక చవితి, 16న ఈద్‌ మిలాదుయిన్‌ నబీ.
అక్టోబర్‌ 2న మహాత్మాగాంధీ జయంతి, 12న విజయదశమి 13న దసరా, 31న దీపావళి.
నవంబర్ లో 15న కార్తీక పౌర్ణమి మరియు గురునానక్ జయంతి.
డిసెంబర్ లో..25న క్రిస్మస్ మరియు క్రిస్మస్ తర్వాతి రోజు 26.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *