ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

0
  • పేదోడి సొంతింటి కళ ను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లు పథకం లాంఛనంగా ప్రారంభం
  • కేసీఆర్ పాలన అంటే నలుగురి కుటుంబ పాలన 
  • కాంగ్రెస్ పాలన అంటే నాలుగు కోట్ల మంది పాలన ప్రజా పాలన: మంత్రి పొన్నం 

హైదరాబాద్ :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో గ్యారంటీ స్కీమ్ ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకాన్ని  సోమవారం ప్రారంభించుకోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం వల్ల పేదోడి సొంతింటి కళ నెరవేరతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించుకోడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటే జనం పార్టీ – పేదల పార్టీ – సకల జనుల పార్టీ సకల జనుల సంక్షేమాన్ని ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేసి చూపుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుందన్నారు. మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా మహిళా సాధికారత దిశలో నడిపించడమే కాంగ్రెస్ పార్టీ అంతిమ లక్ష్యమన్నారు.

ఉచిత విద్యుత్ అయినా 500 కే గ్యాస్ సిలిండర్ అయినా.. ఇప్పుడు సొంతింటి కళ నెరవేర్చే ఇందిరమ్మ ఇల్లు అయినా పేదల కోసమే – మహిళల కోసమే – తెలంగాణ సంక్షేమం కోసమే తమ ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ధనిక రాష్ట్రమని డబ్బా కొట్టిన కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఊరికి 7 ఇళ్లు అయిన ఇచ్చిండా..? పదేండ్లు అధికరమిస్తే వందల ఎకరాల ఫార్మ్ హౌజ్ కట్టుకున్నాడు తప్ప .. పేదల ఇళ్లకు ఒక్క ఇటుకైన పేర్చాడా…? ఇల్లు కట్టుకునే పేదలకు ఓ సారి 5 లక్షలు అని మరోసారి 3 లక్షలు అని జనాలను మభ్య పెట్టాలని చూశారని వివరించారు. తెలివైన తెలంగాణ సమాజం వారికి కర్రు కాల్చి వాత పెట్టి ఫార్మ్ హౌజ్ కి సాగ నంపిందని తెలిపారు.

రాష్ట్రంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదని, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని తెలిపారు. కాంగ్రెస్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే భరోసా.. కాంగ్రెస్ అంటే తెలంగాణ బతుకుకు గ్యారంటీ – తెలంగాణ భవిష్యత్ కి గ్యారంటీ పార్టీ అని వివరించారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం చాలా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందుతుందని తెలిపారు. పేదోడి సొంతింటి కళను నెరవేర్చడం తమ ప్రభుత్వ లక్ష్యం..మొదటి దశలో ఖాళీ స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు ఈ పథకం వర్తించనుంది…ప్రభుత్వం రూ 22,500 కోట్లతో 4,50,000 ఇళ్లను మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు అందనుందని మంత్రి తెలిపారు.

తన నియోజకవర్గం హుస్నాబాద్ లో నిజమైన లబ్ధిదారులు పేదలు సొంత జాగా ఉండి ఇల్లు లేని పేదలకు మొదటి దశలో 3,500 ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. ఈ పథకాన్ని ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ,డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క కి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *