గ్రామీణ డాక్ సేవకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది..

0

గ్రామీణ డాక్ సేవకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది..
. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్

హుజూరాబాద్:
గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలతో పాటు బ్యాంకింగ్ సేవల్ని గ్రామీణ ప్రాంత ప్రజల ఇంటి ముందుకు తీసుకు వెళ్ళటంలో గ్రామీణ డాక్ సేవకుల పాత్ర ఎంతో ప్రముఖమైనదని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్ అన్నారు. బోర్నపల్లి గ్రామ పోస్ట్ మాస్టర్ గా 28 సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు తపాల సేవలు అందించి శనివారం పదవి విరమణ పొందిన వేముగంటి జానకిదేవి-రవీందర్ రావు పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బి వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తపాల శాఖలో గత 28 సంవత్సరాల నుండి నిస్వార్ధ సేవలతో బోర్నపల్లి ప్రజల మన్ననలు పొందిన జానకిదేవి సేవలు అమూల్యమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యు మహేందర్, కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, కేసి క్యాంపు సబ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్ గోపీకిషన్, ఉప్పల్ సబ్ పోస్ట్ మాస్టర్ ఎమ్ రవి, హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం సిబ్బంది ఏ శ్రవణ్ కుమార్, ఎం శ్రీనివాస్, కే సందీప్, హరీశ్, విజయ్, కుమారస్వామి, జి వెంకటేశ్వర్లు, ఎం వెంకటరాజం, దేవయ్య, నాగరాజు తదితర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *