తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం ఏకగ్రీవం

0
  • రాష్ట్రంలో బీసీ కులగణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే
  • ప్రవేశపెట్టిన రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్
  • ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ శాసనసభ

హైదరాబాద్:

వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, మిగతా బలహీన వర్గాల కి చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తము వివిధ సామజిక, ఆర్థిక, విద్యా పరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాలు ప్రణాళికలు రూపోందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రి వర్గం 4. 2. 2024 న తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ అంతటా సమాజిక, ఆర్థిక, రాజకీయ ఉపాధి సమగ్ర ఇంటింటి కుల గణన కుటుంబ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం ఈ మేరకు కులగణనకు సంబంధించిన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన సభలో ప్రవేశపెట్టగా, అది ఏకగ్రీవంగా తెలంగాణ శాసన సభలో ఆమోదం పొందింది.

ఇది అపూర్వ ఘట్టం..‌‌ :- పొన్నం ప్రభాకర్ , రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, బలహీన వర్గాల శాసన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. అందరికీ న్యాయం జరగాలి. పిల్లలు విద్య ఆర్థిక రాజకీయ స్థితిగతులు మెరుగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే మా పార్టీ ఆకాంక్ష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *