పదేళ్లయిన పూర్తికాని కళాక్షేత్రం…

0

హామీలను అమలు చేస్తాం..
. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష

హన్మకొండ:
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్ సముదాయంలో ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల వారిగా అభివృద్ధి పనులపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్క తో కలిసి జిల్లా కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించామన్నారు. గత ప్రభుత్వ హామీలు వాటి స్టేటస్ పై అధికారులతో సమీక్ష చేశామన్నారు. ఇరిగేషన్ పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. డబుల్ బెడ్రూం స్కీమ్ సంబంధించి భారీగా బిల్స్ పెండింగ్ ఉన్నాయని, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేయాలో అధికారులను అడవి తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి ప్రజాపాలన ధరకాస్తులు తీసుకున్నామన్నారు. వాటి ఆధారంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మేడారం జాతర నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం 75 కోట్ల నిధులు కేటాయించామన్నారు. మరో 35 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. స్వంత లాభం కోసం గత ప్రభుత్వం చేపట్టిన పనుల కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్ లో వరంగల్ జిల్లాకి ఏం కావాలో పొందుపరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో 59 జీవో ద్వారా ఆక్రమించుకున్న భూములను పేదలకు ఇస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు ఏంకావాలో వాటి సాధనకు పనిచేస్తామన్నారు.
పదేళ్లయిన పూర్తికాని కాళోజి కళాక్షేత్రం…
కాళోజీ కళా క్షేత్రం పదేళ్ళయినా గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. మేము సాధ్యమైనంత త్వరలో కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ భూమి ఒక్క గజం కూడా వదలమని, ఎవ్వరు ఆక్రమించిన ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *