విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన ఉండాలి

0

విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
పాఠశాలలో ఉపాధ్యాయులు చేప్పే పాఠాలు పిల్లలకు అర్థమయి వాటిని గుర్తుపెట్టుకునేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శనివారం కొత్తపల్లి మండలం చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న పిల్లలను పలు వివరాలను అడిగారు. పాఠశాలలో పిల్లలకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనంలో పౌష్టికతను అందించే పప్పు వంటి బలవర్దకమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం భోజన మెను గురించి అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి విద్యార్థుల సెలబస్ పై అడిగి తెలుసుకొని సైన్స్ సబ్జెక్టులోని కొన్ని ప్రశ్నలను వేస్తూ సమాధానం చెప్పలేని పిల్లలకు ఉదాహారణ పూర్వకంగా వివరించారు. విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు లో పాఠాలను టీచర్లు అర్థం అయ్యేలా వివరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, పాఠశాల ప్రిన్సిపల్ ఇతర టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *