ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

హుజూరాబాద్ :
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీకి బహుమతిగా ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియమ్మ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, మండల అధ్యక్షులు కొల్లూరి కిరణ్, రాజేశ్వర్ రావు, శ్యాంసుందర్ రెడ్డి, చరణ్ పటేల్, పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మహిళా అధ్యక్షురాళ్లు యేముల పుష్పలత, పూదరి రేణుక, రజిత, నాయకులు సాహెబ్ హుస్సేన్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి అస్సర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, పానుగంటి కిరణ్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.