ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు

0

కోర్టు ప్రాంగణంలో ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు
. జిల్లా జడ్జి బి. ప్రతిమ

కరీంనగర్:
కోర్టుకు వివిద కేసుల కోసం హజరయ్యే న్యాయవాదులతో పాటు కక్షిదారుల కొరకు జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రథమ చికిత్స కేంద్రం మరియు డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు జిల్లా జడ్టి బి. ప్రతిమ తెలిపారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం మరియు డిస్సెన్సరీని జిల్లా కలెక్టర్, సిపి లతో కలిసి జిల్లా జడ్జి బి. ప్రతిమ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా జడ్జి బి. ప్రతిమ మాట్లాడుతూ… జిల్లా కోర్టులో వివిద కేసులలో హాజరయ్యే కక్ష దారులతోపాటు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కొరకు కోర్టు ప్రాంగణంలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ కేంద్రంలో ఒక డ్యూటీ డాక్టర్ ఒక స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటారని, అత్యవసర చికిత్సతో పాటు దీనిలో 105 రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శనివారం ఫిజియోథెరపీ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సిపి అభిషేక్ మహంతి, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఉప వైద్యాధికారి జువేరియా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మీప్రసన్న, న్యాయమూర్తులు శ్రీవాణి, లక్ష్మీ కుమారి, కుమార్ వివేక్, నీరజ, అరుణ, వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి రఘునందన్ రావు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కేవీ వేణుగోపాలరావు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వి వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, జూలూరు శ్రీరాములు, ఆరెల్లి రాములు, కోర్టు పరిపాలన అధికారి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *