మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన క్రీడ సంఘాల ప్రతినిధులు

0

మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు తెలిపిన క్రీడా సంఘాల ప్రతినిధులు..

కరీంనగర్:
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా కరీంనగర్ కు విచ్చేసిన పొన్నం ప్రభాకర్ ను గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ క్రీడా సంఘాల బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాను అందించి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఉమ్మడి జిల్లాలో క్రీడారంగా అభివృద్ధికి కృషి చేయాలని పలు క్రీడల్లో అకాడమీలను ఏర్పాటు చేసేందుకు తమ వంతు సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పొన్నం ప్రభాకర్ గతంలో క్రీడా సంబంధిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అదే వైఖరిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని వారు కోరారు. పొన్నంను కలిసిన వారిలో రాష్ట్ర జూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, రాష్ట్ర జూడో సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిల తోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *