నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..

0

నేనేం చేశానో… చర్చించేందుకు సిద్ధమా..
. ఎంపీగా కరీంనగర్ కు వేల కోట్ల నిధులు తెచ్చిన..
. ఇదిగో లెక్కలు… ఈ పుస్తకం చదువుకో…
. నీవల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైంది..
. కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మూడో స్థానమే…
. బీజేపి, కాంగ్రెస్ తూర్పు పడమర…ఎన్నటికీ కలవవు
. కేటీఆర్, వినోద్ కుమార్ లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఫైర్

కరీంనగర్:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాల్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కరీంనగర్ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి ఏమిటో, తెచ్చిన నిధులపై మీ అయ్యతో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. నీకు దమ్ముంటే ఎములాడ రాజన్న దగ్గరకో, కొండగట్టు అంజన్న దగ్గరకే రమ్మను బహిరంగ చర్చకు నేను రడీ’’అంటూ ప్రతి సవాల్ విసిరారు. ఎంపీగా తాను వేల కోట్లు నిధులు తీసుకొచ్చానని పేర్కొన్న బండి సంజయ్ ఆ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు తాను చేసిన అభివృద్ధిపై రూపొందించిన పుస్తకాన్ని చూపిస్తూ..‘నేను ఎన్ని నిధులు తెచ్చానో మచ్చుకు కొన్నింటితో పుస్తకంలో పొందుపరిచా.. ఇవి చదువుకోండి. దమ్ముంటే చర్చకు మీ అయ్యను తీసుకురావాలి’అని చెప్పారు. కేటీఆర్ వల్లే బీఆర్ఎస్ సర్వనాశనమైందన్నారు. ప్రజలు ఓడించినా కేటీఆర్ లో అహంకారం తగ్గలేదని, విర్రవీగుతున్నాడని మండిపడ్డారు. ఆయన ఎంత మొరిగినా కరీంనగర్ లో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదని, ఆ పార్టీది మూడోస్థానమేనని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోని అశోక్ నగర్ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ… అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే… బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి(వినోద్ కుమార్) టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప… ఒక్క పని చేయలే. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదు. కరీంనగర్.. జగిత్యాల, కరీంనగర్…వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు?. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండి యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చాడా అని ప్రశ్నించారు. ఎంపీగా ఉంటూ వేలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన. కేంద్ర మంత్రితో మాట్లాడి కరీంనగర్..వరంగల్, కరీంనగర్..జగిత్యాల, ఎల్కతుర్తి…సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులతో సహా రోడ్ల నిర్మాణం కోసం దాదాపు రూ.8వేల కోట్లకు పైగా నిధులు తెచ్చిందెవరు? మీ అయ్య తెచ్చిండా?….తెచ్చింది నేనే కదా?. కేంద్రంతో మాట్లాడి కరీంనగర్, వరంగల్ రోడ్డు రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన….మీరేం చేశారు? అని అడిగారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ నిధులు తెచ్చింది నేనే కదా…. తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తెచ్చింది నేనే కదా…? శాతవాహన యునివర్శిటీకి అటానమస్ హోదా, ఎస్సారార్ కాలేజీకి 12బీ హోదా తెచ్చిందెవరు? నేనే కదా… మీ అయ్య తెచ్చిండు అనుకున్నవా?అంటూ ఘాటుగా విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 3 వేల ఇండ్లు మంజూరు చేయించానన్నారు. 2015లో కరీంనగర్ ను స్మార్ట్ సిటీ కింద గుర్తించి రూ.196 కోట్లు మంజూరు చేస్తే.. ఆ నిధులను 4 ఏళ్లపాటు బిఆర్ఎస్ నేతలు మళ్లించారని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రం నిధులిస్తోందా? రాష్ట్రం నిధులిస్తోందా?.. దమ్ముంటే గ్రామాల్లోకి వెళ్లి తేల్చుకుందామా? అని సవాల్ విసిరారు. యాదగిరిగుట్టను వ్యాపారం చేసి.. ఏటా ఆలయం ద్వారా ఇంత ఆదాయం వస్తది కాబట్టే కట్టినం అని వ్యాపారమయం చేసిన నాస్తికుడు కేటీఆర్. కేటీఆర్ తోపాటు వినోద్ కుమార్ కూడా నాస్తికుడే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *