లోక్ సభలో గందరగోళం.. భయంతో పరుగులు తీసిన సభ్యులు

0

లోక్​సభలో టియర్ గ్యాస్..
. పరుగులు తీసిన పార్లమెంట్ సభ్యులు
. గ్యాలరీ నుంచి సభ ఛాంబర్​లోకి దూకిన ఇద్దరు వ్యక్తులు
. సభ వాయిదా వేసిన స్పీకర్

ఢిల్లీ:
లోక్‌సభ సమావేశాల్లో గందరగోళం సృష్టించారు ఇద్దరు ఆగంతుకులు. సందర్శకుల గ్యాలరీ నుంచి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకారు. అనంతరం లోక్‌సభ ఎంపీల సీట్లపై కలియదిరిగారు. వీరిద్దరిలో ఓ దుండగుడు కిందకు దూకగానే గ్యాస్ విడుదల చేసే వస్తువులను సభలోకి విసిరినట్లు కాంగ్రెస్​ ఎంపీ అధిర్​ రంజన్​ చౌదరి తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన స్పీకర్‌ ఓం బిర్లా వెంటనే సభను వాయిదావేశారు. ఆగంతకుల చర్యతో సభలోని ఎంపీలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా సభ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీలు జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనలో గ్యాస్​ విడుదల చేసే వస్తువులను దుండగులు తాము ధరించిన బూట్ల నుంచి తీసినట్లు తెలుస్తోంది. కాగా ఈ చర్యకు పాల్పడ్డ ఇద్దరు దుండగులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పార్లమెంట్‌ దాడి ఘటన విచారణలో కీలక విషయాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నాలుగు నెలల క్రితమే పార్లమెంట్‌పై దాడికి నిందితులు ప్లాన్‌ వేశారని తెలిపారు. మొత్తం ఆరుగురు పాల్గొనగా ఇప్పుటికే నలుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరార్ లో ఉండగా వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పార్లమెంట్ భద్రత విషయంలో పకడ్బంద్ చర్యలు చేపట్టాలని స్పీకర్ ఓం బిర్లా హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. విజిటర్ పాసులను రద్దు చేశారు. పార్లమెంట్ గేట్ల వద్ద ఫుల్ బాడీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని భద్రత పెంచాలని స్పీకర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *