పర్యావరణాన్ని రక్షించుకోవడం అవసరం

0
  • పర్యావరణ వేత్త పిట్టల రవిబాబు 
  • కరీంనగర్ వేదికగా 32 మంది కవులు రాసిన ‘వెలుగు రేఖలు’ ఆవిష్కరణ 
  • 20 మంది ప్రజ్ఞావంతులకు ‘జై భారత్’ అవార్డులు ప్రదానం

కరీంనగర్:

కవులకు, కళాకారులకు, మేధావులకు పుట్టినిల్లుగా వెలసిల్లుతున్న కరీంనగర్ వేదికగా అంతర్జాతీయ ఐఎస్ఓ ధ్రువీకరణ పొందిన శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ మరియు ఆర్యాణి సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సంస్కృతి, సాంప్రదాయాలపై 32 మంది కవులు రాసిన కవితలచే రూపొందిన కవితా సంకలనం ‘వెలుగు రేఖలు’ కరీంనగర్ ఫిలిం భవన్ వేదికగా  ఆవిష్కరించారు.

అనంతరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 20 మంది ప్రజ్ఞావంతులకు జాతీయస్థాయి జై భారత్ అవార్డులు ప్రదానం చేశారు. ఇరు సంస్థల అధ్యక్షులు, ప్రముఖ కవి దూడపాక శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మనస్ఫూర్తిగా ప్రదర్శించే కళకు ఎన్నటికైనా చక్కటి గుర్తింపు వస్తుందని చెప్పారు. కేవలం పేరు కోసమే కాకుండా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరూ తాము ఎన్నుకున్న రంగంలో నిస్వార్థ కృషి చేయాలని సూచించారు. సాహిత్యం, సంగీతం తనువు నీడలా కలిసి ఉంటాయని తెలిపారు.

ప్రముఖ పర్యావరణ వేత్త రవిబాబు మాట్లాడుతూ కవులు పర్యావరణంపై దృష్టి సారించి పర్యావరణాన్ని కవిత వస్తువుగా ఎంపిక చేసుకొని చక్కటి కవితలు రాయాలని కోరారు. రోజురోజుకూ తరిగిపోతూ, మానవ ప్రమేయం వల్ల నాశనమవుతున్న ప్రకృతిని, స్వార్థంతో  దోచుకోబడుతున్న సహజవనరులను, కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న పర్యావణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేటి కవులపై, రచయితలపై, సాహిత్యంపై ఎంతో ఉందని గుర్తుచేశారు.

“తరతరాల వెలుగురేఖలు మన సంసృతి సంప్రదాయాలు” అనే కవితా సంపుంటిని పుస్తకాన్ని తమ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసే భాగ్యాన్ని కలిగించి, ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేసి, విజేతలకు తమ చేతులతో సన్మానము చేయించి, వారికీ గౌరవ సత్కారాన్ని చేసే అదృష్టాన్ని కలిగించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని వెల్లడించారు. 

కవి పుంగవులతో, రచయితలతో, కళాకారులతో సభముఖంగా, నేరుగా గుర్తుచ్చేసే అవకాశాన్ని, గౌరవాన్ని ఇచ్చి, నన్ను ఎంతో గొప్పగా జాతీయ స్థాయిలో అవార్డును ఇస్తూ సత్కరించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.నిస్వార్ధంతో సమాజ నిర్మాణంలో మీవంతు కృషిని సాహిత్యంద్వారా సమాజాన్ని, కవిలను, రచయితలను, కలకారులను మేల్కొలుపుతూ, నాటితరం వరసత్వాన్ని పనికిపుచుకొని నేటితరానికి పంచుతూ, ప్రోత్సాహం ఇస్తూ రాబోవుతారాలకు వారసత్వ వారధిగా సాహిత్యాన్ని పాంచాలనుకుంటున్న అందరికీ సదా ఈ సమాజం రుణపడి ఉంటుందని కొనియాడారు.

 

కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత, చిత్రకారులు శ్రీ గౌతమేశ్వర సాహిత్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దూడపాక శ్రీధర్, ప్రముఖ కవి పొర్ల వేణుగోపాలరావు, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, మధుర గాయకులు వి.వి రెడ్డి, ఇరు సంస్థల ప్రధాన సహాయ కార్యదర్శి మణి రాయల్, గాయని వంజ మాలతి, నాట్య గురువు పులిపాక దేవేందర్ తో పాటు అధిక సంఖ్యలో కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *