హుస్నాబాద్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

0

హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు గౌరవం పెంచేలా పనిచేస్తా…
. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి
. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో శాసనసభ్యునిగా గెలిచానని ఈ ప్రాంత ప్రజల గౌరవం పెంచేలా పనిచేస్తానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ లాగే నేను మీ మనిషిని మీకు ఏ సమస్య ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి నేటి తో నెల రోజులు అవుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్యాబినెట్లో గ్యారెంటీలపై చర్చ జరిగిందన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ లను అమలు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 28 నుండి ప్రజా పాలన కార్యక్రమంలో ద్వారా ప్రభుత్వ గ్యారంటీ లపై దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పారన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇంటికి దరఖాస్తులను అందజేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 85 వేల అప్లికేషన్లను స్వీకరించామన్నారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా కూడా ప్రజలకు మంచి చేయాలని దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులలోనే 420 అని విమర్శించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పునరుద్దానంలో భాగంగా హైదరాబాదులో ధర్నా చౌక్ ను ప్రారంభించామని గుర్తుచేశారు. త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తామన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా 2వేల ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మిస్తామన్నారు. దేవాదుల, శ్రీరామ్ సాగర్, వరద కాలువ ఫేస్ 2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు.

నాణ్యమైన వైద్య సేవలు అందించే కృషి..
నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని హమాలీలకు హెల్త్ ప్రొఫైల్ టెస్ట్ చేపించే ఏర్పాటు చేస్తానన్నారు. ఈ ప్రాంతం నుండి వైద్య సేవల కోసం నిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తానన్నారు. హుస్నాబాద్ నుండి ఏ ప్రాంతానికైనా బస్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ బస్సు డిపోను మరింత బలోపేతం చేస్తానన్నారు. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో బెన్ షాలోమ్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, ఏసీపీ సతీష్, మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *