పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి

0

ఓటరుగా నమోదు చేసుకోవాలి..
. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

హనుమకొండ:
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం హనుమకొండ జిల్లాలోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గురించి కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ శాసన మండలి స్థానానికి నూతనంగా ఓటు హక్కును కల్పించేందుకు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కోసం ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. 01.11.2023 నాటికి మూడు సంవత్సరాల ముందు డిగ్రీ, డిప్లొమా, తత్సమాన విద్యార్హతను కలిగివున్న గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత విద్యాసంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నవారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఏ మండలానికి చెందిన గ్రాడ్యుయేట్లు ఆయా మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో సమగ్ర వివరాలతో పాటు జత చేయాల్సిన జిరాక్స్ పత్రాలతో ఓటరు నమోదు దరఖాస్తు పత్రాన్ని నాయబ్ తహశీల్దార్ కు అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు ఫారాలు తీసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు పత్రాన్ని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తు పత్రంతోపాటు డిగ్రీ, డిప్లొమా, తత్సమాన విద్యార్హతల పత్రాలను గ్రాడ్యుయేట్లు సమర్పించాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫిబ్రవరి 6వ తేదీ ఆఖరు గడువని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్లు అయిన ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత హెచ్ఓడీల ద్వారా ధ్రువీకరణ చేసిన పత్రంతో ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఫిబ్రవరి 24వ తేదీన ఉంటుందని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 14వ తేదీ వరకు అందజేయాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితా ఏప్రిల్ 4వ తేదీన ఉంటుందన్నారు. ఈ శాసనమండలి స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ, డిప్లొమా, తత్సమాన విద్యార్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఇ. వి. శ్రీనివాస్ రావు, బిజెపి నుండి రావు అమరేందర్ రెడ్డి, బిఎస్పీ నుండి ఎం. మణి, సిపిఎం నుండి గొడుగు వెంకట్, ఎఐఎంఐఎం నుండి సయ్యద్ ఫైజుల్లా, టీడిపి నుండి శ్యామ్ సుందర్, వైఎస్ఆర్సిపి నుండి రజినీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *