ప్రభుత్వం మంచి పాలనను అందించాలి

0

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి
. ఆర్థిక వనరుల సాధనలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానం
. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్

హైదరాబాద్:
పదేళ్ల కాలంలో ఎంతో శ్రమించి సీఎం కేసిఆర్ సాధించిన రాష్ట్ర ఆర్థిక వనరులను (SOTR) కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు. బంగారు పళ్లెంలో ఆర్థిక వనరులు అప్పగించామన్నారు. ఆర్థిక వనరులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు. ఒక సారి ఆర్బిఐ నివేదికను చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలను అందించాలని కోరుకుంటున్నానున్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల ఆర్థిక వనరుల కన్నా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి సాధించాయని చెప్పుకునే గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ వంటి అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక వనరుల సాధనలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ అప్పుల రాష్ట్రం అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు కాంగ్రెస్ నాయకులు పదేపదే చెప్పడాన్ని తప్పుపట్టారు. దేశంలోని 28 రాష్ట్రాల ఆర్థిక వనరుల వివరాలతో ఆర్.బి.ఐ విశ్లేషణను విడుదల చేసిందన్నారు. ఆర్బిఐ నివేదిక ప్రకారం సొంతంగా ఆదాయాన్ని (SOTR) సమకూర్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 84.2 శాతంతో రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఒక్క వ్యవసాయ రంగంలోనే 400 శాతం వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరిగిందన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, ఇతర పప్పు దినుసులు భారీ ఎత్తున పండించడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడానికి దోహదపడిందన్నారు. పుష్కలంగా విద్యుత్తు, నీటి సౌకర్యం ఉండడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల రాష్ట్రంలో మూడు షిఫ్టులలో పరిశ్రమలు పనిచేయడం.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటి రంగంలో పరిశ్రమల్లో ఎంతో పురోగతిని సాధించామన్నారు. తద్వారా రాష్ట్ర ఆదాయం బాగా పెరిగిందన్నారు. 2014లో రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండగా, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 26,000 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *