ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పని చేయాలి

0

విధులు వారి గౌరవాన్ని పెంపోందించేలా ఉండాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించే విధులు వారి గౌరవాన్ని పెంపొందించేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని జిల్లా శిక్షణ కేంద్రంలో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ జూనియర్ అసిస్టెంట్ లు, పంచాయితి సెక్రటరీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనం నిర్వర్తించే బాద్యతలు మన గౌరవాన్ని పెంపోందించేలా ఉండాలని పేర్కోన్నారు. మారుతున్న కాలoలో పుస్తకం, పెన్ను వంటివి మనకు దూరం అవుతున్నాయని, కాని ప్రతి ఒక్కరు వారి నిత్య విధులలో భాగంగా వారికి ఎదురయ్యే సమస్యలను, విషయాలను, సంఘటనల గురించి నోట్ చేసుకోవడం ద్వారా ఆ విషయం ఎక్కువ కాలం గుర్తుండిపోతుందన్నారు. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను త్వరగా అర్థంచేసుకొని సునాయాసంగా పరిష్కరించగలుగుతామన్నారు. విధి నిర్వహాణలో బాగంగా ఎదైన పనిని పూర్తిచేయాలంటే దాని కొరకు ఎక్కువ సమయాన్ని ఆఫీసులో కేటాయించడం కాదని, పనిపై స్పష్టత చిత్తశుద్దితో సీరియస్ గా పనిచేస్తే తక్కువ సమయంలోనే పనిపూర్తిచేయగలుగుతామని తెలిపారు. ప్రతిఒక్కరు కచ్చితమైన లక్ష్యాన్ని నిర్థేశించుకొని కష్టపడి పనిచేయాలని సూచించారు.

ప్రతిఒక్కరు మరొకరికి గౌరవాన్ని ఇస్తూ, బాద్యతయుతంగా వ్యవహరిస్తూ విధులను నిర్వహించినప్పుడే మీరు నాయకత్వం వహించగలుగుతారని తెలిపారు. పనిపూర్తి చేయడంలో మరోకరిని ప్రేరణ తీసుకోవడం కాదు, మీద్వారా మీరు ప్రేరెపితులు కావాలని, సరైన సమయంలో సరిగ్గా వ్యవహరించి సమస్యలను పరిష్కరించి ఉన్నతంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ అధికారి శ్రీనివాస్ రావు, పంచయత్ కార్యదర్శులు జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *