ఇంటలిజెన్స్ కమిటీ ఏర్పాటు…

0

జిల్లా ఇంటలిజెన్స్ కమిటీ ఏర్పాటు… 
. సున్నితమైన ఎన్నికల వ్యయ నియోజకవర్గాలు మరియు ప్రాంతాల గుర్తింపు
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
రాబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేసిన ఖర్చు, డబ్బు మద్యం ఇతర వస్తువుల పంపిణీ పట్టివేతకు సంబంధించిన సమాచారం ఆధారంగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో కరీంనగర్ జిల్లాలోని ఎన్నికల వ్యయ సున్నితమైన నియోజకవర్గాలు మరియు ప్రాంతాలను గుర్తించటకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేల సత్పతి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ ఇంటలిజెన్స్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీలో జిల్లా రెవెన్యూ శాఖతో పాటు, పోలీస్, ఐ.టి, జీఎస్టీ, బ్యాంకులకు చెందిన నిర్దేశిత అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. పైన తెలిపిన శాఖలకు చెందిన అధికారులు డిస్టిక్ ఇంటలిజెన్స్ కమిటీలో సభ్యులుగా ఉండి గత అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఖర్చు చేసిన డబ్బు, మద్యం ఇతర వస్తువుల పంపిణీ పట్టివేతలు సమాచారం ఆధారంగా ప్రాథమిక నివేదిక ఏర్పాటు చేయాలన్నారు. ఆ నివేదిక ఆధారంగానే జిల్లాలోని సున్నితమైన వ్యయ అసెంబ్లీ నియోజకవర్గాలు, ప్రాంతాలను ఎన్నికల సంఘం గుర్తించి తదనుగుణంగానే, వాటిని ప్రత్యేకంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్వో పవన్ కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు, ఏసిపి పి కిష్టయ్య, ఇన్ కమ్ టాక్స్ అధికారి ఆర్. రాజేష్, జీఎస్టీ అధికారి వి. మదనయ్య, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఆంజనేయులు, ఎలక్షన్స్ డిటి లు,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *