ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజు

0

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు
. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ వినియోగం పై విస్తృత ప్రచారం కల్పించాలి
. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తు స్వీప్ కార్యక్రమాల నిర్వహణ
. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్

కరీంనగర్:
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఓటరు ధృవీకరణ, ఓటరు జాబితా తయారీ, వంటి పలు అంశాల పై ఆయన సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఓటర్ల నమోదుకు జనవరి 1, 2024 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు. ఓటరు జాబితా సవరణ 2024 కు ముందు పోలింగ్ కేంద్రంలో 1500 కంటే ఎక్కువ ఓటర్లు ఉండకుండా పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్థీకరణ చేయాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు జాబితాలో మరణించిన ఓటర్ల వివరాల తొలగింపు, ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జిఐఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. జనవరి 6, 2024న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, 22జనవరి, 2024 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలన్నారు. ఫిబ్రవరి 2, 2024 లోగా అభ్యంతరాలను, ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, ఫిబ్రవరి 8, 2024న తుది ఓటరు జాబితా రుపోందించాలని ఆయన స్పష్టం చేశారు.
18 సంవత్సరాల వారి ప్రత్యేక జాబితా..
18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న ఓటర్లు ఓటర్ ఐడి కార్డుకు తమ ఆధార్ కార్డు లింక్ చేసేందుకు అందించిన ఆధార్ కార్డు ప్రతులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిర్వహించాలని ఈఆర్ఓలకు ఆయన సూచించారు. ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ప్రతి వారం వస్తున్న నూతన ఓటరు దరఖాస్తులు, జాబితా నుంచి తొలగిస్తున్న ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందిస్తూ, పోలింగ్ కేంద్రాలలో, తహసిల్దార్ కార్యాలయంలో అతికించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో ప్రత్యేక అధికారుల ద్వారా 18 సంవత్సరాలు నిండిన వారి నుంచి నియోజకవర్గం వారిగా నూతన ఓటరు దరఖాస్తులు స్వీకరించాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా రూపకల్పనలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి చేయాల్సిన పనులపై స్పష్టమైన సమాచారం అందించి, వారి పనితీరును నిత్యం సమీక్షిస్తూ మెరుగైన ఫలితాలు సాదించాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం ఓటరు జాబితా రూపకల్పన కీలకపాత్ర పోషిస్తుందని అర్హులైన వారందరికీ తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నివేదికలను ఎన్నికల కమిషన్ కు సకాలంలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు, నగదు ఆభరణాల జట్టు వివరాలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కేసుల వివరాలు మొదలగు అంశాలపై సంపూర్ణ నివేదికను సకాలంలో సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, కరీంనగర్ ఆర్డిఓ కె. మహేశ్వర్, కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *