నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయాలు సమర్పించాలి

0

డిసెంబర్ 29 లోగా ఎన్నికల వ్యయ వివరాలు పూర్తిచేయాలి
. జిల్లా సహకార అధికారి రామానుజ చార్య

కరీంనగర్:
సాధారణ అసెంబ్లీ ఎన్నికలు-2023 లలో పోటిచేసిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన ఖర్చుల వివరాలను డిసెంబర్ 29 లోపు సిద్ధం చేసి ఎన్నికల వ్యయ పరిశీలకునికి పంపించడానికి సిద్దంగా ఉంచాలని జిల్లా సహకార అధికారి ఏస్. రామానుజచార్య తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సాధారణ అసెంబ్లి ఎన్నికలు-2023 అభ్యర్థులు, ఏజెంట్లకు ఎన్నికల వ్యయ వివరాల సమర్పణపై శిక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. సాధారణ అసెంబ్లీ ఎన్నికలు-2023 ఎన్నికలలో అభ్యర్థులు ఖర్చుచేసిన పూర్తి వివరాలను ఎన్నికల సంఘం సూచించిన విధంగా సమర్పించాలన్నారు. ఎన్నికల్లో ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించని అభ్యర్థులను భవిష్యత్తులో పోటీ చేయడానికి ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సహాయ వ్యయ పరిశీలకులు మనోజ్ కుమార్, చొప్పదండి ఏఈవో జోయెల్, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *