కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అమలు చేసింది: మంత్రి పొన్నం

1

కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అమలు చేసింది
. రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్:
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల్లో మహాలక్ష్మి పథకంలోని మొదటిదైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే అమలు చేశామని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మంత్రి పొన్నం టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటిది అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శనివారం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ఆడపడుచులకు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. శనివారం అసెంబ్లి ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, రాష్ట్ర మంత్రులంతా కలిసి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం పథకం ప్రారంభించడం పట్ల రవాణా శాఖ మంత్రి గా ఆనందంగా ఉందని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగి వేసారి పోయిన తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ పాలన ద్వారా ప్రజా సమస్యలు తెలుపుకునే విధంగా వ్యవస్థను మార్చినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్ ద్వారాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించే వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుపరిచి చూపిస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

1 thought on “కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అమలు చేసింది: మంత్రి పొన్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *