రంజాన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి: మంత్రి పొన్నం

1
  • ప్రజలకు ఇబ్బందులు కలవకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

హైదరాబాద్:

రంజాన్ నెల సమీపిస్తున్న నేపథ్యంలో పండగ ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ ఇన్ చార్జి  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది.  సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ స్నేహాలత శోభన్ రెడ్డి ,వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, మాజీ హోంమంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ , ఎంఐఎం ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీ , బలాలా , కౌసర్ మొయినుద్దీన్ , మహమ్మద్ మజీద్ హుస్సేన్ , మీర్ జుల్ఫికర్ అలీ , మహమ్మద్ ముబిన్ , ఎమ్మెల్సీలు మీర్జా రహమాత్ బెగ్, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫెండి. బీఆరెస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ నెల సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు తీసుకోవలసినటువంటి చర్యలపైన మంత్రి పొన్నం ప్రభాకర్  పలు సూచనలు చేశారు. దీంతోపాటు హైదరాబాద్ ఎమ్మెల్యేలు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకు వచ్చినటువంటి సమస్యలు, పండగ ఏర్పాట్లకు ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ ఎమ్మెల్యేలు మంత్రి పొన్నం ప్రభాకర్  కు పలు సూచనలు చేశారు.. రంజాన్ నెలలో నగరంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.. మసీదుల వద్ద నీటి టాంకర్లను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలో నీటి ట్యాంకర్ల కొరత లేకుండా చూడాలని సూచించారు.. నగరంలో మసీదుల వద్ద అదనపు క్లీనింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎక్కడ కూడా అపరిశుభ్ర వాతావరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఓల్డ్ సిటీ కి తాగు నీరు అందించే మీరాలం పంపు హౌజ్ ని రిపేర్ చేపించాలని కోరారు. మక్కా మసీదు , షాహి మసీదు లను రిపేర్ చేయడం తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అభ్యర్థించారు. డ్రైనేజి లను శుభ్రపరచాలని ఇమామ్ లకి , మోజన్ లకి జీతాలు రిలీజ్ చేయాలని తెలిపారు. రంజాన్ నెల కోసం హైదరాబాదులో ఏర్పాటు చేసిన విధంగా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు.

నగరంలో షాపులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని , పుట్ పాత్ ల వద్ద అమ్ముకునే చిరు వ్యాపారులను పోలీసులు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. రంజాన్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అదనపు లోడ్ పడినపుడు ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ ఫార్మర్ లు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో కుక్కల బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. స్ట్రీట్ లైట్స్ ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. చెత్త సేకరణ పూర్తి స్థాయిలొ చేపట్టాలని చెత్త సేకరణ ఆటోలు పూర్తిగా అన్ని కాలనీలో తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు..

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వస్తున్న మొదటి రంజాన్ నెలను ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా జరుపుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మసీదుల వద్ద శామియానాలు , వాటర్ ఫెసిలిటీ, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ ఎమ్మెల్యేలు కోరిన అంశాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆన్ని కాలనిల్లొ తాగునీటికి ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంచినీటి ట్యాంకర్లు అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు..ఓవర్ లోడ్ పడినప్పుడు ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు అదనంగా ఉంచడంతో పాటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు.. అదనపు శానిటేషన్ టీమ్స్ ని ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ కి సూచించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కోరిన విధంగా రంజాన్ మాసం సందర్భంగా షాపులు 24 గంటలు నడుపుకోవడాన్ని పరిశీలించాలన్నారు. పుట్ పాత్ ల పై ఉండే చిరు వ్యాపారులను ఇబ్బందులు కలిగించవద్దని హైదరాబాద్ , సైబారాబాద్ , రాచకొండ పోలీస్ అధికారులతొ పాటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు.

రంజాన్ నెలలో ఇఫ్తార్ తో పాటు షేహార్ సమయాల్లో తనిఖిల పేరుతొ ఇబ్బందులు కలిగించద్దని ట్రాఫిక్ పోలీస్ అధికారులకు సూచించారు. రంజాన్ పండుగ నిధుల విషయంలో సీఎం తో చర్చిస్తానని హామీ ఇచ్చారు .. వచ్చే నెల రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండి రంజాన్ నెల ని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉమర్ జలీల్ , జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుధిప్ దురషెట్టి , ఇతర విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 thought on “రంజాన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి: మంత్రి పొన్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *