కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం..

0

దేశంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం..
. సిపిఐ ఆవిర్భావ వేడుకలలో తక్కళ్లపల్లి శ్రీనివాసరావు

దామెర :

ఈ దేశంలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నయం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ 99 వ వార్షికోత్సవ సందర్భంగా దామర మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సిపిఐ జెండాను ఆవిష్కరణ చేసిన అనంతరం తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ దేశంలో అనేక బూర్జువా పార్టీలు వచ్చి కనుమరుగైనాయని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవానికి భూమి కావాలని లక్షలాది ఎకరాలను భూమి పంచిన చరిత్ర సిపిఐదని అన్నారు. కుల, మత తత్వానికి వ్యతిరేకంగా, ప్రాంతీయ తత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు అనేక జాతాలను నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉందన్నారు. కరువు కాటకాలను నుండి ప్రజలను రక్షించే కొరకు తన వంతు బాధ్యతగా అంబలి కేంద్రాలను కొనసాగించిి ఆకలి దప్పికల నుండి పేదలను రక్షించిన చరిత్ర సిపిఐ దని, మెట్ట ప్రాంత ప్రజలను నిరంతరం కరువు కోరలు చాస్తున్న ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టించి సాగునీరు అందించాలని, యువతకు ఉపాధి కల్పించుటకు పరిశ్రమలు అందించాలని. రోడ్లు విద్య వైద్యం రైతుల గిట్టుబాటు ధరలు వ్యవసాయకులకు కూలి రేట్లు అందించాలని, జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వంద రోజులు నుండి పెంచాలని కోరారు. దేశ స్వతంత్రం వచ్చి దశాబ్దాల దాటుతున్నా పేదవాడు మరింత పేదవాడుగా ధనికుడు మరింత ధనికుడుగా బేధాలు కొనసాగుతున్నా పాలకపక్ష పార్టీలకు పెడచెవిన పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాననున్న రోజుల్లో పేదల ఇండ్ల స్థలాలు ,ఇండ్లు ,విద్యా వైద్యం కోసం, పరిశ్రమల స్థాపన కోసం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, ప్రజలు భాగస్వాములు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు కోరారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొట్టెపాక రవి అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మండల కార్యదర్శి అంబి సాంబయ్య, భాస్కర్, గొలుసుల దేవేందర్, ఐలయ్య, రాధిక, మంజుల, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *