స్మారక సాహితీ పురస్కారం ప్రధానోత్సవం

0

ఘనంగా ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక సాహితీ పురస్కారం 2023 ప్రధానోత్సవం

హనుమకొండ :
సాహితీవేత్త వాసిరెడ్డి భాస్కర్ రావు అరసం వరంగల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సమావేశంలో డాక్టర్ రమణ యశస్వి, నెట్లుట్ల రమాదేవిలకు సంయుక్తంగా ఆచార్య వాసిరెడ్డి భాస్కర రావు స్మారక సాహితీ పురస్కారం అందజేశారు. ఆదివారం హనుమకొండ లస్కర్ బజార్ లోని ప్రభుత్వ అభ్యసన ప్రాథమిక పాఠశాలలో అరసం వరంగల్ అధ్యక్షులు నిధి బ్రహ్మచారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అరసం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ హాజరైనారు. ఈ సందర్భంగా నారయణ మాట్లాడుతూ.. కథ ఎవరికోసం రాస్తున్నామో వారి జీవితం మార్చేదిగా ఉండలన్నారు. పది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అరసం వరంగల్ భాస్కరరావు పేరు పై అవార్డ్ ఇవ్వడం అభినందనీయం అన్నారు. అవార్డ్ పొందిన కథా సంపూటలు డాక్టర్ రమణ యశస్వి “మా గణపవరం కథలు”ను డాక్టర్ వాసిరెడ్డి కృష్ణారావు పరిచయం చేయగా, నెల్లుట్ల రామదేవి “తల్లి వేరు” ను ఏలేశ్వరం వెంకటేశ్ పరిచయం చేశారు. ఈ సమావేశంలో పల్లేరు వీరస్వామి నూతనంగా అరసం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులుగా ఎన్నికైనా సందర్భంగా వారిని అరసం వరంగల్ తో పాటుగా శ్రీలేఖ సాహితి, వల్లపట్ల ఆర్ట్స్ అకాడమి, తెలంగాణ రచయితల సంఘం పరకాల సాహితి సమితి కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, పరకాల సాహితి సమితి తదితర సంస్థలు మిత్రులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో బూర భిక్షపతి, డా॥శంకర్ నారయణ, ప్రముఖ సాహితి వేత్తలు డా॥ టి శ్రీరంగస్వామి, వల్లంపట్ల నాగేశ్వర్ రావు, చందు, అన్వర్, అమ్మిన శ్రీనివాస్, బాలబోయిన రమాదేవి, బిల్ల మహేందర్, డా॥భండారు సుజాత, పద్మావతి, వాణిశ్రీ, డా॥ఆకూనూరి విద్యాదేవి, ఎర్ర ప్రసన్న, శైలజ, బిట్ల అంజని దేవి, లేనిన్, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *