కలెక్టరేట్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి

0

వరంగల్ కలెక్టరేట్ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
. వరంగల్ కలెక్టర్ పి. ప్రావీణ్య

వరంగల్:
వరంగల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనాల నిర్మాణ పనులలో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ అజాం జాహిమిల్ గ్రౌండ్స్ లో వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని పరిశీలించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… భవన సముదాయ నిర్మాణం ఫౌండేషన్ లెవెల్ పూర్తిచేసుకుని వెంటల్ లెవెల్ కు చేరుకున్నాయని అన్నారు. మ్యాప్ ను పరిశీలించి దాని ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో కోనసాగుతున్న నిర్మాణ పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలతో త్వరగా పూర్తి చేయుటకు అధికారులకు పలు సూచనలు సలహాలు అందించామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించే ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఎస్సీ నాగేందర్ రావు, ఈఈ జితేందర్ రెడ్డి, డిఈ రాజు, ఏఈ శ్రీకాంత్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ నిర్మాణ ప్రగతిని పరిశీలించిన కలెక్టర్..
అనంతరం గీసుకొండ మండలం కొనయిమాకుల గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకుని ముగింపు దశలో ఉన్న ఈవీఎం గోడౌన్ భవనాన్ని కలెక్టర్ పి. ప్రావీణ్య పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్మాణ పనులు పూర్తిచేసుకుని ముగింపు దశకు చేరుకున్నదని, ఫినిషింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఎస్సీ నాగేందర్ రావు, ఈఈ జితేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *