కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం

0

13న కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
. మంత్రుల బృందం, అధికారులు
ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

హైదరాబాద్:
కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణాలు, అవకతవకలు పిల్లర్లు కుంగిపోయిన ఘటన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల మేడిగడ్డ సందర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల రాక కోసం అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రత్యేక బస్సుల్లో సీఎంతో పాటు ఎమ్మెల్యేలు మంత్రులు రానుండడంతో మహదేవపూర్ నుంచి మేడిగడ్డ వరకు రోడ్లకు మరమ్మతులు నిర్వహించారు. సెంటర్ లైనింగ్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. లక్ష్మీ బ్యారేజీ పరిసర ప్రాంతం తో పాటు వంతెన గోదావరి నదిలోకి వెళ్లేందుకు మార్గాన్ని నిర్మించారు.
లక్ష్మీ బ్యారేజ్ సందర్శనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డు మార్గంలో వస్తుండడంతో వారు ప్రయాణించే బస్సుల తో పాటు విఐపి ల వాహనాల పార్కింగ్ సంబంధించి ప్రదేశాలను ఎంపిక చేశారు. సూరారం, అంబటిపల్లి వద్ద రెండు పార్కింగ్ ప్రదేశాలతో పాటు వీఐపీల పార్కింగ్లను మేడిగడ్డ బ్యారేజీ వద్దనే సమావేశం నిర్వహించే వేదిక కుడివైపు ఏర్పాటు చేశారు. అంబటిపల్లి లోని ఎల్ అండ్ టి కార్యాలయం సమీపంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు భోజన వసతి ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ ప్రాంతాల సరిహద్దు కావడంతో మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రత్యేక పోలీసు బలగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతానికి సరిహద్దును ఉన్న ఛతీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎంఓఓఎస్ డీ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఏర్పాట్లు ఇంటెలిజెన్స్ డీఐజీ ఎం శ్రీనివాస్ ముఖ్యమంత్రి కార్యాలయ ఓ ఎస్ డి సోమవారం పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులకు వివరించారు.

షెడ్యూల్ ఇదే..

9.30 గంటలకు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరుట

2.00 మధ్యాహ్నం మేడిగడ్డ బ్యారేజీ కు చేరుకుంటారు.

2.00 నుంచి 3.00 ఎండల వరకు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తారు.

3.00 నుండి 4.00 గంటల వరకు నీటిపారుదల శాఖతో రివ్యూ సమావేశం

4.00 నుండి 7.00 వరకు మీడియా సమావేశం

5.00 మేడిగడ్డ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గం గుండా తిరుగు ప్రయాణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *