పోస్టల్ పొదుపు, భీమా పథకాలపై జైళ్ల శాఖ సిబ్బందికి, ఖైదీలకు అవగాహన

1

హుజూరాబాద్:

2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్బంగా పోస్టల్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దశలో బాగంగా సమాజంలోని వివిధ వర్గాలకు పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన అనేక పథకాల పైన అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నది. హుజురాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం పోస్ట్ మాస్టర్, CPC పర్యవేక్షకులు, సిబ్బంది సబ్ జైలు కారాగారం హుజురాబాద్ ను శుక్రవారం సందర్శించి, జైలు సూపెరిండెంట్, సిబ్బంది, ఖైదీలకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా పోస్ట్ మాస్టర్ యూ. మహేందర్ మాట్లాడుతూ “సమాజ ఆర్థిక అభివృద్దికి పోస్టల్ పొదుపు పధకాలు, తపాలా భీమా పథకాలు ఎంతో మేలు చేస్తాయని, అప్పుడే పుట్టిన బిడ్డ నుండి వయోజనులకు వృద్ధాప్యంలో ఉన్న వారికి సైతం పోస్టల్ పథకాలు వినియోగించుకోవటానికి అర్హులు అని, ఆక్సిడెంటల్ భీమా పథకంలో చేరే 18 నుండి 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అటువంటి వాళ్లు కేవలం సంవత్సరంకు గాను 520 రూపాయలు లేదా 755 రూపాయలు చెల్లించినట్లితే 10 లక్షలు లేదా 15 లక్షలు ప్రమాద భీమాకు అర్హులు’’ అని తెలిపారు. ఖైదీలు జైలు నుండి సత్ప్రవర్తనతో విడుదలయ్యి తమ కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలని సూచించారు.

తరువాత తపాలా జీవిత భీమా సలహాలు సూచనలను సీపీసీ సూపర్ వైజర్ Pఅమర్ నాథ్ రెడ్డి తెలిపారు. అవగాహన సదస్సు అనంతరం పలువురు సిబ్బంది తపాలా జీవిత భీమా పథకంలో చేరారు. కార్యక్రమంలో సబ్ జైలు సూపెరిండెంట్ గణేష్, పోస్ట్ మాస్టర్ మహేందర్ , అమర్ నాథ్ రెడ్డి , పోస్ట్ మాన్  సంపత్, హరీష్, రాజేష్, శివాజీ, సత్యం, స్వామి, జైలు సిబ్బంది, ఖైదీలు వైద్యులు పాల్గొన్నారు.

1 thought on “పోస్టల్ పొదుపు, భీమా పథకాలపై జైళ్ల శాఖ సిబ్బందికి, ఖైదీలకు అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *