సమ్మక్క జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

0

సమ్మక్క-సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి
. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర
. అధికారులు సమన్వయంతో పని చేయాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
జిల్లాలో నిర్వహించనున్న సమ్మక్క, సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడారు. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జిల్లాలో 16 చోట్ల సమక్క సారలమ్మ జాతర జరగనుందని, అందులో రేకుర్తి, కేశవపట్నం మరియు హుజురాబాద్ లలో పెద్దఎత్తున జాతర జరుగుతుందని పేర్కోన్నారు. జాతర కొరకు చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలను రూపొందించుకొని ముందస్తుగానే పనులను ప్రారంభించాలని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా మంచినీరు, టాయిలెట్, సానిటేషన్ మొదలగు అన్ని ఏర్పాట్లను చేపట్టాలన్నారు. క్యూలైన్ కొరకు బారికేడిగ్ ఏర్పాటు చేయాలన్నారు. జాతర సమయంలో కెనాల్ లో స్నానాల కొరకు నీటిని విడుదల చేయాలని, గజఈతగాల్లను నియమించాలని, జాతర మొదలుకొని ముగిసే వరకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫర ఉండేలా చూడాలన్నారు. 108 వాహనాలు, మందులు, డాక్టర్లతో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులందరు వారి శాఖా పరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లను చేసి జాతరను విజయవంతం చేయడంలో సమన్వయంతోముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కరీంనగర్ ఆర్డివో మహేశ్వర్, జిల్లా ఎక్సైజ్ అబ్కారి శాఖ అధికారి శ్రీనివాసరావు, మిషన్ భగీరథ సిఈ అమరేందర్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ రామ్ కుమార్, అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న, జిల్లా వైద్యాధికారి లతితాదేవి, ఎండోమెంట్ శాఖ అధికారులు, వివిద శాఖల అధికారులు, పాలకసభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *