బాలవికాస ఆధ్వర్యంలో ఆదరణ దినోత్సవం

0

బాలవికాస ఆధ్వర్యంలో ఆదరణ దినోత్సవం

హుజురాబాద్:
హుజురాబాద్ బాలవికాస మరియు జన వికాస్ ఆధ్వర్యంలో ఆదరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం హుజరాబాద్ పట్టణంలో అనాధ వృద్ధులకు బాలవికాస ఆధ్వర్యంలో దుస్తులతో పాటు నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఆదరణ లేని అనాధ వృద్ధుల కోసం బాలవికాస ఫౌండర్ బాల తెరిసా జింగ్ రాస్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాలవికాస కోఆర్డినేటర్ లు రాణి, అమూల్య, మొగిలి, నాగరాజ్, రాజా రాజేశ్వరి, సొల్లు బాబు, లింగయ్య, ఐలయ్య, బాలవికాస ప్రతినిధులు ఎండి ఖాజాబీ, లీలావతి, రజిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *