అక్రమ లేఔట్ ల పై చర్యలు తీసుకోవాలి

0
  • జిల్లా కలెక్టర్, కమిషనర్ కు మున్సిపల్ పాలకవర్గం ఫిర్యాదు

హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలో అనధికారికంగా, అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న లే అవుట్లను వెంటనే నిలిపివేసి తగు చర్యలు చేపట్టాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కు, పోలీస్ కమిషనర్ కు హుజరాబాద్ మునిసిపల్ పాలకవర్గం గురువారం ఫిర్యాదు చేసింది. హుజురాబాద్ లో అనధికార లేవట్లపై జిల్లా కలెక్టర్ కు ఇప్పటివరకు అనేక ఫిర్యాదులు చేశారని, దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యల నిమిత్తం స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పెడచెవిన పెట్టారని మున్సిపల్ పాలకవర్గం భావించింది. దీంతో గురువారం జరిగిన మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అక్రమ లేవట్లపై జిల్లా కలెక్టర్ తో పాటు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

అక్రమ లేఔట్లతో ప్రభుత్వ ఆదాయానికి, పురపాలక సంఘానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అక్రమ లేఔట్ చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని, అట్టి రిజిస్ట్రేషన్ లను వెంటనే నిలిపివేయాలని ఫిర్యాదులో కోరారు. అంతేకాకుండా ఒకవేళ ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి అయితే అందులో 10 శాతం భూమిని పురపాలక సంఘానికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుండి అక్రమంగా ఏర్పడిన, ఏర్పడుతున్న లేఅవుట్ల నుండి కనీసం ఒక శాతం ఓపెన్ స్పేస్ కూడా పురపాలక సంఘానికి కేటాయించడం లేదన్నారు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను సైతం తొలగించాలన్నారు. ఈ విషయంపై తగు ఆదేశాలిచ్చి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల తో పాటు కౌన్సిలర్లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *