20 అంశాలకు మున్సిపల్ పాలకవర్గం ఆమోదం

0

పండుగల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
. మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక

హుజురాబాద్:
రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు చైర్ పర్సన్ గందె రాధిక సూచించారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గందె రాధిక అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 అంశాలను ప్రస్తావించగా పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆమె తెలిపారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాట్లు చేయుటకు లక్ష రూపాయలు నిధులను కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా జనవరిలో జరిగే సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరిగే కార్యక్రమం ఉన్నందున హనుమాన్ దేవాలయం వద్ద రూ.45 వేలతో ఎల్ఈడి లైట్లు ఏర్పాట్లు చేయుటకు ఆమోదించామన్నారు. పండుగల సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ. లక్ష 75 వేలతో సున్నం మరియు బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేయుటకు కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ ఎస్ సమ్మయ్య, కౌన్సిలర్లు, కార్యాలయ మేనేజర్ కె. రాం మోహన్ రాయ్, ఇంచార్జి మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సాంబరాజు, టిపిఎస్ ఎన్. అశ్వినీ గాంధీ, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎమ్. కిషన్ రావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *