100 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు

0

హైదరాబాద్:
ఆర్టీసీ బలోపేతానికి రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆదివారం టీఎస్ ఆర్టీసీకి సంబంధించిన 100 నూతన బస్సులను సీఎం, మంత్రులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సీతక్క, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పచ్చా జెండా ఊపి కొత్త బస్సులను ప్రారంబించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ షురూ చేశారు. ఆర్టీసి ఎండి సజ్జనార్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసి పల్లె పల్లె కి పోవాలనే ఆలోచనతో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే అక్క చెల్లెళ్లకు ఆర్టీసికి ఉచితంగా ప్రయాణం అందించామని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి జ్యోతి బాపులే ప్రజా భవన్ గా పెట్టుకున్నామని వివరించారు. తెలంగాణ ఉద్యమం లో 60 రోజులు సమ్మె చేసిన వారిని ఏనాడు గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే తమ జీవితాలు బాగుపడుతాయని ‘‘నై చలేగా బస్ కా పయ్య’’ అని ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకోలేదని తెలిపారు. ఆర్థిక మంత్రి విక్రమార్క ఆర్టీసీ కి భవిష్యత్ లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

గతం లో ఆర్టీసీ నిర్వహణ సరిగా లేక నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ముఖ్యమంత్రి బంధువుగా ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 4 సంవత్సరాలు ఎండీగా ఉండి ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ అక్యుపెన్సీ పెరిగిందని వెల్లడించారు. 60 రోజుల కాలంలో ఇప్పటి వరకు 15 కోట్లకు మందికి పైగా ఉచితంగా ప్రయాణం చేశారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *