కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందా…

చేజార్చుకున్న కాంగ్రెస్…

హైదరాబాద్:
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల ఫలితాలు ఎలా ఉన్నాయి. తెలంగాణలో 119 స్థానాలకు గానూ కాంగ్రెస్ 65, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచారు. రాజస్థాన్ లో 199 స్థానాలకు గానూ బీజేపీ 115, కాంగ్రెస్ 70, ఇతరులు 14 స్థానాల్లో గెలిచారు. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు గానూ బీజేపీ 160, కాంగ్రెస్ 65, ఇతరులు 1 స్థానాల్లో గెలిచారు. ఛత్తీస్ ఘడ్ లో 90 స్థానాల్లో బీజేపీ 52, కాంగ్రెస్ 35, ఇతరులు 1 స్థానాల్లో గెలిచారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకున్నప్పటికీ ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో అధికారాన్ని కోల్పోయింది. ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది.