క్రీడలతో మానసిక ఉల్లాసం..

0

అవకాశాలను సద్వినియోగం చేసుకొవాలి
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
విద్యార్థి దశలో విద్యతోపాటు క్రీడారంగాల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ (ఎస్సీ) పాలిటెక్నికల్ కళాశాలలోని తెలంగాణ క్రీడాప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ 2023-24 లో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం 11 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు నిర్వహించిన మార్చీఫాస్ట్ స్వాగతాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. క్రీడలలో పాల్గోన్న విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. క్రీడలు భవిష్యత్తుల్లో మంచిస్థానాన్ని చేరుకున్న క్రమంలో సులువుగా నాయకత్వం వహించేలా మిమ్మల్ని ముందు నిలబెడతాయని పేర్కోన్నారు. క్రీడల్లో క్రీడాకారులుగా హృదయ పూర్వకంగా పూర్తి నిభద్దతతో పాల్గొని విజయాలను సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తనకు క్రీడలలో ఎటువంటి అనుభవం లేకపోయిన పాఠశాల స్థాయిలో నిర్వహించే మార్చి ఫాస్ట్ లో మాత్రం చురుకుగా పాల్గొనే దానిని అని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రస్తుతం మన వయస్సుకన్న ఎక్కువ అనుభవం ఉన్న అధ్యాపక బృందం ఉందని, వారు మీ పూర్తి జీవితానికి కావలసిన పాఠాలను నేర్పిస్తారని ఆమె అన్నారు. విద్యార్థి దశ పూర్తిచేసుకున్న తరువాత ఉద్యోగ అవకాశాలలో ప్రధానంగా విద్యతోపాటు క్రీడలతో చూపిన ప్రతిభను కూడా పరిగణలోకి తీసుకుంటారని తెలిపారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ పాలిటెక్నిక్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు జి. అప్పారావు, బి రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *