జిమ్ చేస్తే ఫిట్ గా ఉండొచ్చు..

0

ఫిట్‌నెస్‌ కోసం జిమ్ ఎంతో ఉపయోగం..
. ఏఆర్ డిఎస్పి ప్రతాప్
. ఘనంగా ఫిట్ డాక్ జిమ్ వార్షికోత్సవ వేడుకలు

కరీంనగర్:
ఫిట్‌నెస్‌ పెంపొందించుకునేందుకు జిమ్ ఎంతో ఉపయోగ పడుతుందని ఏఆర్ డిఎస్పి సి ప్రతాప్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో గల ఫిట్ డాక్ జిమ్ 5వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఏఆర్ డిఎస్పి సి ప్రతాప్, ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెక్రటరీ ఊట్కూరి రాధాకృష్ణారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జిమ్ నిర్వాహకులు, సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులు డైరెక్టర్ అనుప్ రావు, చైర్మన్ లు సంతోష్ రావు, కరుణాకర్ రావులు మాట్లాడుతూ.. అనతికాలంలోనే తమ జిమ్ సెంటర్ అందరి మన్ననలు పొందిందడం సంతోషంగా ఉందన్నారు. 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం ఉచిత యోగ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిమ్ కు చెల్లించే నెలవారి ఫీజులో సైతం 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *