దివ్యాంగులు స్పూర్తి ప్రదాతలు…

0

దివ్యాంగులు స్పూర్తి ప్రదాతలు…
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్:
సమాజంలో దివ్యాంగులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుదవారం కరీంనగర్ పట్టణంలోని డాబిఆర్ అంబేడ్కర్ స్టేడియంలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసే వ్యక్తులు విజయాలను సాధిస్తే, ప్రతికూలతలను అదిగమిస్తూ అసమాన విజయాలను సాధించే దివ్యాంగులు ఎంతో మందికి స్పూర్తి ప్రదాతలుగా నిలుస్తారని అన్నారు. దివ్యాంగులకు అండగా, తోడుగా నిలుస్తూ వారికి సకాలంలో సరైన ప్రోత్సహన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తున్న టీచర్లు, గార్డియన్ల ను కలెక్టర్ అభినందించారు. జిల్లా స్థాయి ఆటల పోటిలలో పాల్గోన్న వారందరు రాష్ట్ర స్థాయిలో కూడా అద్బుతమైన విజయాలను సాధించాలని ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంబించారు. తదనంతరం అందులు ఆడే చెస్ పోటీలను వీక్షించిన కలెక్టర్ వారి ఆటతీరును తన ఫోన్లో వీడియో తీసుకోవడంతో పాటు వారి ప్రతిభను అభినందించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి దివ్యాంగుల ఆటల పోటీలలో శారీరక వైకల్య సమస్యలను అదిగమించి ఉత్సాహంగా పాల్గోంటున్న వారందరిని ఆయన అభినందించారు. వీరందరు జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి ఆటల పోటిలలో కూడా ప్రతిభను కనబరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, క్రీడాభివృద్ధి అధికారి రాజవీర్, డిఆర్డివో శ్రీలత, దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ నర్మద, కమల, ఏసిడిపివోలు సౌందర్య, అరవింద, దివ్యాంగుల సంఘాల బాధ్యులు జక్కం సంపత్, వెన్నం శ్రీనివాస్, కొత్తూరు స్వామి, ఐలి లింగమూర్తి, శ్రీవాణి, మంచాల రాజేందర్, కైరి అంజయ్య గౌడ్, బిక్షపతి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *