కేసీఆర్ ను బొక్కలో ఎందుకు వేయడం లేదు..?

0

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ డ్రామాలు..
– కాళేశ్వరంలో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ను జైల్లో పెట్టరెందుకు..?
– కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే…
– ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

హుజురాబాద్:
రాష్ట్రంలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బిఆర్ఎస్ గ్రామాలు ఆడుతున్నదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం పి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ లో చేపట్టిన ప్రజాహిత యాత్ర శనివారం హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోందని, 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయన్నారు. ఎన్నికల తర్వాత అమలు చేస్తామని కాకమ్మ కథలు చెప్పబోతున్నరని విమర్శించారు. గత పాలనలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో కుమ్కక్కై 6 గ్యారంటీలపై నోరు మెదపడటం లేదని మండిపడ్డారు. రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి కాబోతున్నారని గర్వంగా చెబుతున్నామని.. మరి కాంగ్రెస్ గెలిస్తే ప్రధానమంత్రి ఎవరో ప్రకటించే దమ్ముందా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కావాలా.. వద్దా…
ప్రధాని నరేంద్ర మోడీ కావాలా వద్దా? అని ప్రజలను అడిగారు. నరేంద్ర మోడీ గెలవాలంటే బీజేపీ గెలవాలని, మోదీ గెలిస్తేనే పేదల రాజ్యం కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం పేరిట కాంగ్రెస్.. పాలమూరు పేరిట కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కెసిఆర్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
హుజురాబాద్ అభివృద్ధికి కేంద్రం 480 కోట్ల కేటాయింపు…
హుజూరాబాద్ అభివృద్ది పనుల కోసం 480 కోట్ల రూపాయలకుపైగా కేంద్రం ఇచ్చిందన్నారు. నకల్ కొట్టడానికి అకల్ అన్నట్లు హిందీ పేపర్ లీక్ చేశానని కేసిఆర్ ప్రభుత్వం ఆరోపించి నన్ను జైల్లో పెట్టిందన్నారు. నాపై వందకుపైగా కేసులు పెట్టారని, రెండు సార్లు జైల్లో పెట్టినా భయపడకుండా మీకోసం కొట్లాడుతున్న అన్నారు. 100 రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు 80 రోజులు పూర్తయిన హామీలు అమలు కాలేదన్నారు. గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుతో ఉంటేనే ఆరు గ్యారంటిలు అంటూ కాంగ్రెస్ లిటికేషన్ పెట్టడం ఎంత వరకు సమంజసం అన్నారు. దళిత బంధు కోసం 4900 మంది దరఖాస్తు చేసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, వాళ్లకు దళిత బంధు వచ్చే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *